![]() |
![]() |
.webp)
రీతూ - డీమన్ పవన్ కలిసి నటించిన బంగారం సాంగ్ లాంచ్ కి అఖిల్ సార్థక్ వచ్చాడు. ఇక అఖిల్ అక్కడ జరిగిన ఒక చిన్న చిట్ చాట్ లో చాలా ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. " ప్రస్తుతానికి రెండు సిరీస్ చేస్తున్నాను. నేను నా వర్క్ తో బిజీగా ఉన్నాను. ప్రస్తుతానికి బంగారం అంటూ నా లైఫ్ లో ఎవరూ లేరు . ఈ బంగారం సాంగ్ చూసాక ఒక మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. అది యు ట్యూబ్ కి తీసినట్టు అనిపించలేదు. డెమోన్ రీతూ ర్యాపొ కానీ ఇద్దరి పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. రీతూ దీని కోసం ఎంత వర్క్ చేసిందో నాకు పర్సనల్ గా తెలుసు. ఆమె టీవిలో చేస్తోంది ట్రావెలింగ్ చేస్తోంది పవన్ కోసం. నేనే ఒకసారి అడిగా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నావ్ అని . అప్పుడామె నేను చేయాలి అని చెప్పింది. ఆమె చాలా సపోర్టివ్ గా ఉంటుంది. నిజానికి బిగ్ బాస్ నుంచి వచ్చాక ఏ అమ్మాయి ఆ ట్రాక్ కి సపోర్ట్ చేయదు. ప్రాబ్లమ్ అవుతుందని. రీతూ సపోర్ట్ చేస్తూ పవన్ కి బ్రాండ్స్ తెస్తూ పవన్ తో కలిసి బ్రాండ్స్ చేస్తూ నువ్వు ఎదుగు నేను ఎదుగుతా అనే టైపు రీతూ మెంటాలిటీ. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. బిగ్ బాస్ తర్వాత అవకాశాలు రాలేదు. తొక్కేసారండి తొక్కేసారండి. ఇండస్ట్రీలో కొంతమంది తొక్కేశారు. అలా తొక్కినా కానీ నేను కం బ్యాక్ ఇస్తున్నాను. అలా అని కాదు కానీ మళ్ళీ గట్టిగానే రాబోతున్న. ఈ ఇయర్ నా నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ని రోజులు ఆగినందుకు ఒకటి చేస్తాను. నాకు ఇంతకుముందు గ్రూమింగ్ అనేది తెలీదు. ఇప్పుడు తెలిసింది. ఇక అందం సీక్రెట్ అంటే రెగ్యులర్ గా ఫుడ్ ఎలా తింటానో జిమ్ కి కూడా అలాగే వెళ్తాను. " అని చెప్పాడు అఖిల్ సార్థక్. బావ మరదలు అనే షార్ట్ ఫిలిం ద్వారా అఖిల్ మూవీ ఛాన్సెస్ కొట్టేసాడు. అలాగే కళ్యాణి అనే సీరియల్ లో నటించాడు. ఆ తరువాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.
అఖిల్ సార్థక్ అంటే చాలు బిగ్ బాస్ సీజన్ 4 గుర్తు రాక మానదు. అందులో మోనాల్ - అఖిల్ స్నేహం కూడా ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఐతే వీరి ఫ్రెండ్ షిప్ బిగ్ బాస్ వరకే ఆగిపోయింది. వీళ్ళ మధ్య ఏదో ఉంది అనుకున్నారంతా అప్పట్లో. కానీ అలాంటిది ఏమీ లేదని కూడా వీళ్ళు తర్వాత చెప్పేసారు. ఐతే బిగ్ బాస్ 4 రన్నరప్ గా నిలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా కంటెస్టెంట్ గా వెళ్ళాడు.
![]() |
![]() |